మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఆదివారం తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా ఎకరాకు సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పి. రూ. 12 వేలకు పరిమితం చేశారని మండిపడ్డారు. తెలంగాణ అప్పుల పాలైన సంగతి ఎన్నికల ముందు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు