మహబూబ్ నగర్: నవంబర్ 9 వరకు నవోదయ దరఖాస్తు పొడిగింపు

57చూసినవారు
మహబూబ్ నగర్: నవంబర్ 9 వరకు నవోదయ దరఖాస్తు పొడిగింపు
జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9, 11వ తరగతులలో ప్రవేశానికి బుధవారంతో గడువు ముగియగా. మరోసారి నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించారని గురువారం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతానికి చెందినవారు ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్