మహబూబ్ నగర్: ప్రజా పాలన విజయోత్సవ వాహనాన్ని అడ్డుకున్న ప్రజలు

81చూసినవారు
ప్రజా పాలన విజయోత్సవ వాహనాన్ని బుధవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజలు అడ్డుకున్నారు. ఆరు గ్యారంటీ అమలు విషయమై కళాజాత కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ కళాకారులను మహిళలు, వృద్ధులు, ప్రజలు నిలదీశారు. అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్