జోగులాంబ గద్వాల జిల్లాలో 23 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని బుధవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సందర్శించి, బిజెపి తరపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ. ఎస్ఎస్ఎ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, రెగ్యులరైజ్ చేయాలి. గతంలో చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామన్నోళ్లు ఇప్పుడేం చేస్తున్నట్లు.? ఎస్ఎస్ఎ ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలవాలని, హామీలపై పోరాడుదాం అన్నారు.