తిరుమలలో తెలంగాణ భక్తులపై టీటీడీ వివక్ష చూపుతున్నారని గురువారం తెలంగాణ బిఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీటీడీపై ఆరోపణలు చేశారు. శ్రీవారి దర్శనం, గదుల విషయంలో పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ భక్తులపై వివక్ష చూపించడం మంచిది కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగాక పదేళ్లలో ఇలాంటి తేడాలు జరగలేదని చెప్పారు. ఇప్పుడే ఇలా జరుగుతోందని, దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దీన్ని సరిచేయాలని కోరారు.