పూర్వవిద్యార్ధుల అసోసియేషన్ కృషి అభినందనీయం: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులను, మెరిట్ సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు "మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్ధుల అసోసియేషన్" ఆధ్వర్యంలో శనివారం 66మంది విద్యార్థులకు రూ. 4, 55, 000 స్కాలర్ షిప్ లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పూర్వ విద్యార్థుల కృషి అభినందనీయమని అన్నారు