మహాత్మా గాంధీ జయంతి రోజున కల్లు విక్రయాలు
గాంధీ జయంతి రోజున మత్తు పానీయాలు విక్రయించరాదని నిబంధనలను కల్లు వ్యాపారస్తులు ఉల్లంఘించారు. బుధవారం పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఓ కల్లు దుకాణ వ్యాపారి ఏకంగా గాంధీ జయంతి రోజునే కల్లు విక్రయించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.