దేవరకద్ర: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మూసాపేట్ మండలం జానంపేట్, కొమ్మిరెడ్డి పల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని అన్నారు, ఈ సీజన్ నుండి సన్న రకం ధాన్యంపై రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు, గ్రేడ్-ఎ ధాన్యానికి క్వింటాలకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు.