మల్దకల్ మండల పరిధిలోని దాసరపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా ఉంది. గ్రామ కార్మికులు చెత్తాచెదారం తీసుకొని పోయి డంపింగ్ యార్డ్ లో కాల్చేది ఉండగా? ఊరి పక్కల ఎక్కడ బడితే అక్కడ చెత్త చెదారం వేసి కాలుస్తున్నారు. అలాగే ఈ చెత్త చెదారం కాల్చడం వలన ఊరికి పక్కన ఉన్న స్కూలు, గ్రామానికి పొగ కప్పుకొని పొల్యూషన్ ఏర్పడుతుందని గ్రామ ప్రజలు అంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.