లడ్డూ అంశంలో సిట్ దర్యాప్తు నిలిపివేత
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఎల్లుండి వరకు సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ప్రకటించారు. లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారనడానికి ఆధారాలు లేకుండానే సీఎం చంద్రబాబు ఎలా ప్రకటన చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.