రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ పరిధిలోని దయ్యాల వాగు సమీపంలో చోటు చేసుకుంది. ఎర్రవల్లి స్టేజ్ నుంచి గద్వాలకు బుధవారం ఉదయం వస్తుండగా దయ్యాల వాగు సమీపంలో ఉన్న బ్రిడ్జి వాల్ ను కారు బలంగా ఢీకొని కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డికి తీవ్రగాయాలు కాగా గమనించిన స్థానికులు హుటాహుటిన గద్వాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.