మైనర్ బాలిక రాజేశ్వరి మృతి వెనుక అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగల్ల రంజిత్ కుమార్ బుధవారం గద్వాలలో విలేకరులతో అన్నారు. జిల్లా చైర్మన్ గొంగల రంజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాజేశ్వరి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడితే ఎవరికీ ప్రమాదం పొంచి ఉందొనని, వెంటే ఉండి వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ఎవరని, అతనిని కూడా అరెస్టు చేయాలన్నారు.