జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట తరగతులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు జరుగుతాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.