బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ముఖ్యఅతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుద్ రెడ్డి, యేన్నం శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మెన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ. డి. జానకి, జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.