విద్యుత్ సిబ్బంది ఏదైనా పనికి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని విద్యుత్తు సంస్థ సీఎండి శుక్రవారం ముషారఫ్ ఫరుఖీ తెలిపారు. ఈ మేరకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది గానీ, అధికారులు కానీ ఏదైనా పనికి లంచం అడిగితే 040-23454884, 7680901912 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు.