మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో సురేందర్ గౌడ్ అనే రైతుపై ఆక్రమ ఇసుక రవాణా దారులు సోమవారం అర్థరాత్రి హత్యాయత్నం చేశారు. రైతు పొలం ఇసుక ట్రాక్టర్లతో నిత్యం ఇసుక రవాణా ఎందుకు చేస్తున్నారని, మా పొలాలన్ని పాడైపోతున్నాయని ప్రశ్నించగా చేతికి అందిన కర్రలతో రైతు తలను పగలగొట్టారు. బాధితుని ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు ఒక టాక్టర్ ను సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.