జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శుక్రవారం వారాంతపు కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతుండడం, శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ఉండడంతో స్వగ్రామములకు వెళ్లి వాహనాలతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకునిన ఎస్ఐ తిరుపాజీ సిబ్బందితో కలిసి 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.