మహబూబ్ నగర్: చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తా: ఎమ్మెల్యే యెన్నం

76చూసినవారు
మహబూబ్ నగర్: చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తా: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రి రోడ్ లోని పెంతి కోస్ట్ మిషన్ చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం పెంతి కోస్ట్ మిషన్ చర్చి సంఘ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు కాంపౌండ్ వాల్ కూలిపోయిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి, వాల్ నిర్మాణానికి ఎస్టిమేషన్స్ తయారు చేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్