ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లిపై కత్తితో దాడి

38106చూసినవారు
ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేసిన ఘటన అచ్చంపేట మండలం గుంపన్పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. అఖిల, అఖిల్ అన్నాచెల్లెళ్లు. వారం క్రితం అఖిల ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో ఆగ్రహంతో ఉన్న అఖిల్ కత్తితో చెల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అఖిలను అచ్చంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు. ప్రస్తుతం అఖిల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్