కొందుర్గు మండలం గంగన్నగూడానికి చెందిన శేఖర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి సమీపంలో ఉన్న ఉప్పలకుంట చెరువులో శేఖర్ రెడ్డి గతంలో చేపలు బయటకు వెళ్లేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన శేఖర్ రెడ్డి తిరిగి రాకపోవడంతో పలుచోట్ల గాలించగా చెరువులో శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య? హత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.