అమిస్తాపూర్ గ్రామానికి చెందిన శీను, యాదమ్మ అవసరం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోట చంద్రశేఖర్ జువెలరీ షాప్ లో తాకట్టుపెట్టి అవసర నిమిత్తం ఆ డబ్బును తిరిగి తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో డబ్బును పోగొట్టుకున్నారు. దారిన చూసిన ఆ డబ్బును క్యూన్యూస్ రిపోర్టర్ రాఘవేందర్, జనవాహిణి రిపోర్టర్ కృష్ణ రూ. 30,000 లను వెంటనే వన్ టౌన్ ఎస్సై కి అప్పజెప్పి వివరాలు తెలుసుకోని బాధితులకు బుధవారం అప్పజెప్పారు.