ఉట్కూర్ మండల కేంద్రంలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు.