క్రిష్ణా మండల కేంద్రంలో మంగళవారం శ్రీ క్షీరలింగేశ్వర స్వామి జాతర సంధర్భంగా నిర్వహించిన రథోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథానికి పూజలు నిర్వహించి రథోత్సవంలో పాల్గొన్నారు. రథోత్సవానికి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు, పక్క రాష్ట్రం కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.