తిరుమలలో రేపటి నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. ధనుర్మాసం కారణంగా గత నెల రోజుల నుంచి తిరుమలలో సుప్రభాత సేవను టీటీడీ అధికారులు నిలిపేశారు. పండితుల అభిప్రాయం ప్రకారం ధునుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో తిరుమలలో సుప్రభాత సేవల స్థానంలో తిరుప్పావై పాశురాలు పఠిస్తారు. అయితే రేపటితో ధునుర్మాసం ముగియడంతో తిరిగి సుప్రభాత సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.