స్వామి వివేకానంద ఆశయాలను సాధించేందుకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా జలసాధన సమితి కో కన్వీనర్ నరసింహ అన్నారు. ఉట్కూర్ మండలం బిజ్వర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. యువకులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని, సేవాభావం కలిగి ఉండాలని అన్నారు.