నారాయణ పేట జిల్లా పరిధిలోని మాగనూరు మండలం కోల్పూర్ గ్రామ పంచాయితి దగ్గర మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి కార్యక్రమం గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజేపివిసీ వ్యవస్థాపకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కెవి నరసింహ, బి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.