మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో కొన్నేండ్ల నుంచి కూరగాయలు అమ్ముకుంటున్న బాలమ్మ అనే వృద్ధురాలు.. రోడ్డుపై చెత్తతో పాటు కుళ్లిన కూరగాయలు వేస్తుందని మున్సిపల్ సిబ్బంది రూ.200 జరిమానాతో నోటీసులిచ్చారు. మరోసారి ఇలా చేస్తే రూ.10 వేల వరకు జరిమానా వేస్తామని హెచ్చరించారు. దీంతో కలత చెందిన బాలమ్మ అక్కడే కిందపడిపోయింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.