ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వినతి

72చూసినవారు
ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వినతి
ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా అమరచింత మండలం కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ మాట్లాడుతూ కూలీల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక ఎంపీడీవో శ్రీనివాసులకు మెమోరండం ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్