నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి కి సంతాపంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని దేశానికి ఆయన మృతి తీరని లోటని దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు గట్టేంకించారని ఆయన సేవలను కొనియాడారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.