కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతయ్య తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వివరాల ప్రకారం. దేవిశరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా శ్రీజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల దర్శనానికి వెళ్లిన నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవితో గద్వాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతయ్య వెళ్లారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో తిరుపతయ్య అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆంబులెన్స్ లో అలంపూర్ ఆసుపత్రి కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.