ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పని సరిగా నిర్మించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో మన మరుగుదొడ్డి మన ఆత్మ గౌరవం అనే అంశంపై మీటింగ్ నిర్వహించారు. ఈ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) ప్లస్ మోడల్ గ్రామాలుగా మార్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నామన్నారు.