అమ్రాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

80చూసినవారు
అమ్రాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి వ్యక్తి మృతి చెందాడు. శ్రీశైలం - హైదారాబాద్ ప్రధాన రహదారి అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం ముకర్ల బాద్ కు చెందిన అరవింద్ (35) అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అతనిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్