నాగర్ కర్నూల్ జిల్లా లోని ఎస్పీ కార్యాలయంలో నమోదైన ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాధితులతో మాట్లాడి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. భూమి పంచాయతీలు 12, ఇతర రకాల సమస్యలకు సంబంధించి 5 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తామని తెలిపారు.