నారాయణపేట మండలం లింగంపల్లి భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు మిల్లు యజమాని తెలిపారు. గత కొన్ని రోజులుగా రైతుల నుండి కొనుగోలు చేసిన సుమారు పది వేల క్వింటాళ్ల పత్తి మంటల్లో దగ్ధం కాగా, రూ. 7 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. రైతులకు సంబంధించిన పత్తి లేదని, తాము కొనుగోలు చేసిన కాటన్ మాత్రమే కాలిపోయిందని చెప్పారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.