కర్నూలులో ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్: టీజీ భరత్

54చూసినవారు
కర్నూలులో ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్: టీజీ భరత్
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెడతామని ప్రజలను మోసం చేసింది. కానీ తాము ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలు కూడా కర్నూలులోనే ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్