యువతలో సాంస్కృతిక సృజన వెలికి తీసేందుకు జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నారాయణపేట జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జానపద నృత్యం, జానపద గీతాల పోటీల్లో పాల్గొనే వారు ఈనెల 25 లోపు 9490409900 నంబర్ కు పేర్లు వాట్స్ అప్ చేయాలని కోరారు. పోటీల్లో జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలకు పంపిస్తామని అన్నారు.