మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతున్న రైతు పండుగ 2వ రోజు శుక్రవారం వేడుకల్లో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తో కలిసి స్టాళ్లను పరిశీలించారు. వ్యవసాయ పరికరాలు ఎలా పని చేస్తాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రేపటి సీఎం సభకు రైతులు తరలి రావాలని కోరారు.