నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి మమ్మద్ అబ్దుల్ ఘని సందర్శించారు. టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి పదో తరగతి స్పెషల్ క్లాస్ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందరూ ఉత్తీర్ణులు అయ్యేటట్లు చేయాలని అన్నారు. హెడ్మాస్టర్ భారతి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.