జిల్లావ్యాప్తంగా వైద్య శాఖలో పనిచేస్తున్న కార్మికుల ఐదు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రి ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు నెలకు 26 వేల వేతనం ఇవ్వాలని అన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు.