మాదిగలు కలిసి చేసిన పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని టీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు అన్నారు. శనివారం మరికల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడి నుండి భారీ ర్యాలీ ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. దశాబ్ద కాలంగా వర్గీకరణ కొరకు పోరాటం చేశామన్నారు.