వికారాబాద్ ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషను ఏర్పాటు చేస్తే.. ఫారెస్ట్ సమీపంలో ఉన్న 20 గ్రామాల్లోని దాదాపు 60,000 మంది ప్రజల జీవితాలు ప్రభావితవ్వనున్నాయి. అడవిపై ఆధారపడిన చిన్న రైతులు, పశువులను మేపుకుంటూ జీవిస్తున్న కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అటవీ విధ్వంసం మూసీ, కాగ్నా వంటి స్థానిక నదులపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రాజెక్ట్ నుండి వచ్చే రేడియేషన్, చెట్లను నరికివేయడం ఫలితంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు.