వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక

79చూసినవారు
వనపర్తి జిల్లా పెద్దగూడెం రోడ్డు పక్కన ఒక కోళ్ల షెడ్డులో ఏర్పాటుచేసిన వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను గురువారం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సభ్యులు సందర్శించారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇక్కడ సరైన వసతులు లేవని, వెంటనే అక్కడి నుంచి తరలించి వనపర్తిలోని అనుకూలమైన భవనంలోకి కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలంలో వెంటనే నిర్మించాలన్నారు.

సంబంధిత పోస్ట్