కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

63చూసినవారు
రైతులు, మహిళలను, వయోవృద్ధులను నిరుద్యోగులను మోసం చేసి 420 హామీలు, ఆరు గ్యారంటీలను అటకేక్కించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రైతాంగ ప్రజా నిరసన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మించి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్