ఉపాధి హామీ కూలి రూ. 600 ఇవ్వాలి

572చూసినవారు
ఉపాధి హామీ కూలి రూ. 600 ఇవ్వాలి
ఉపాధి హామీ పనికి రోజు కూలి రూ. 600 ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు. వ్యవసాయ పనులకు వెళితే రైతులు, సిమెంట్, మట్టి పనికి వెళ్తే మేస్త్రీలు రూ. 600 కు పైగా ఇస్తున్నారని అంటున్నారు. ఉపాధి హామీ పనిలో కొలతలు తీసి దాని ప్రకారం కూలి ఇస్తున్నారని రోజుకు రూ. 150 నుంచి 200 మాత్రమే కూలి పడుతోందని చెబుతున్నారు. కేంద్రం ఉపాధి కూలీ రూ. 272 గా నిర్ణయించిందని, గురువారం వనపర్తి జిల్లాలో ఇంతవరకు ఏ ఒక్కరికి లభించలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్