వనపర్తి జిల్లాలో నక్సలైట్ పేరుతో అమాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎస్పీ రావుల గిరిధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా మామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి అలియాస్ ప్రమోద్‌రెడ్డి అనే వ్యక్తి మాజీ నక్సలైట్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సోలిపూర్ గ్రామానికి చెందిన తేనేటి శేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి రైస్ మిల్లు అసోసియేషన్ నుంచి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సుదర్శన్‌రెడ్డి అరెస్ట్ చేశారు.