వనపర్తి జిల్లాలో వేసవి శిక్షణ శిబిరాలు

79చూసినవారు
వనపర్తి జిల్లాలో వేసవి శిక్షణ శిబిరాలు
వనపర్తి జిల్లా క్రీడల శాఖ ఆద్వర్యంలో జిల్లాలో 12చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహణకు నిర్ణయించినట్లు మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖాధికారి సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. మే 1 నుంచి 31 వరకు క్రీడా శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. వనపర్తిలో ఫుట్ బాల్, హాకీ, తైక్వాండో, యోగ, పెబ్బేర్లో క్రికెట్, ఫుట్బాల్, ఘన్పూర్ లో అథ్లెటిక్స్, శ్రీరంగాపూర్లో కబ్బడి, ఆత్మకూర్, మదనాపూర్ లో వాలీబాల్ నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్