వనపర్తి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది. గోపాల్ పేట మండలం బండరావిపాకులకు చెందిన దంపతులు విద్యుత్ షాక్తో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం. దూసు బక్కయ్య, భార్య నాగమ్మ సీతాఫలాల కోసం శుక్రవారం అడవికి వెళ్లారు. అడవి పందుల కోసం పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.