వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి హత్య జరిగి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు నిందితులను గుర్తించడంలో పోలీసుల వైఫల్యంపై నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు అనుచరులతో కలసి సోమవారం చిన్నంబాయి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దోషులను పట్టుకోకపోవడం బాధకరమన్నారు.