అమ్మానాన్నల మృతితో వారి ఐదుగురు పిల్లలు అనాథలైన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన సునీత, హుస్సేనయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. మూడు సంవత్సరాల క్రితం తండ్రి మరణించడంతో తల్లి కూలిపనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. బుధవారం సునీత అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అనాథలైన వారి ఐదుగురి పిల్లలను ఆదుకోవాలని శుక్రవారం స్థానికులు కోరుతున్నారు.