వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువులో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. అనుమానాస్పదంగా తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో పడి మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం. వనపర్తి పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన నసీఫ్ బేగం తన పిల్లలు హబీబ్, సనా బేగం చెరువులో దూకి చనిపోయినట్లు తెలిపారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.